ఎన్ని అవార్డులో!

ఒక ఆస్కార్‌..3 బాఫ్తా.. 2 గోల్డెన్‌ గ్లోబ్‌.. 2 టోనీ.. 2 ఎమ్మీ.. 7 వేర్వేరు... ఇవన్నీ ఓ నటి సాధించిన అవార్డులు. ఆ నటే అన్నే బాన్‌క్రాఫ్ట్‌. నటిగా, దర్శకురాలిగా, రచయితగా, గాయనిగా బహుముఖంగా రాణించిన ఈమెకు ప్రతి రంగంలోను అవార్డులు వచ్చిపడ్డాయి. నాటకరంగం, టీవీ రంగం, సినీ రంగాల్లో మంచి అభినేత్రిగా పేరొందిన ఈమె 1931 సెప్టెంబర్‌ 17న పుట్టింది. ‘డోన్ట్‌ బాదర్‌ టు నాక్‌’ (1952)తో సినీ రంగ ప్రవేశం చేసిన అన్నే, ‘ద మిరకిల్‌ వర్కర్‌’, ‘ద గ్రాడ్యుయేట్‌’, ‘ద టర్నింగ్‌ పాయింట్‌’, ‘ఏగ్నెస్‌ ఆఫ్‌ గాడ్‌’, ‘టుబి ఆర్‌ నాట్‌ టుబి’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది. 1984 ‘గార్బో టాకీస్‌’ ఎస్టెల్లె రోల్స్‌ పాత్రలో నటించినందుకు గాను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. నటి, దర్శకురాలు, రచయిత, గాయనిగా బాహుముఖ ప్రతిభ కలిగిన ఈమె మార్టిన్‌ మే అనే అతన్ని 1953లో పెళ్లి చేసుకుంది. నాలుగు సంవత్సరాలు కొనసాగిన వీరి కాపురం 1957లో విడిపోయారు. తదుపరి ఏడు సంవత్సరాల తరువాత నటుడు - నిర్మాత అయిన మేల్‌ బ్రూక్స్‌ను 1964న వివాహం చేసుకుంది. వీరి ఒక కుమారుడు కూడా ఉన్నారు. పేరు మాక్స్‌ బ్రూక్స్‌ నటుడు, రచయితగా రాణిస్తున్నారు. అన్నే తన డెభ్బై మూడేళ్ల యసులో అమెరికాలోని మాన్‌హట్టన్‌లో జూన్‌ 6, 2005న కన్నుమూశారు. వెండితెర - బుల్లితెరలపై చివరి దాకా నటిస్తూనే ఉంది. సినిమా అంటే అన్నే బాన్‌క్రాప్ట్‌కి ఎంతో ప్రేమ.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.