
వెండితెరపై నటిగా మెరిసింది... మొనాకో దేశపు యువరాజు మనసు దోచింది... అతడిని పెళ్లాడి ప్రిన్సెస్ ఆఫ్ మొనాకో అయింది... ఆమే గ్రేస్ ప్యాట్రిషియా కెల్లీ. ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న కెల్లీ.. 1929 నవంబర్ 12న ఫిలడెల్ఫియాలో పుట్టింది. నటనా రంగంపై ఆశపడి టీవీలలో మెప్పించి, వెండితెర నటిగా మారింది. ‘ద కంట్రీగర్ల్’ సినిమాతో ఆస్కార్ అందుకుంది. అంతర్జాతీయంగా అందాల నటిగా పేరొందిన కెలీ, ‘మొగాంబో’, ‘హైనూన్’, ‘హై సొసైటీ’, ‘డయల్ మి ఫర్ మర్డర్’, ‘రేర్ విండో’ లాంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.