మాజీ అధ్యక్షుడి మాజీ భార్య!

మె అమెరికా మాజీ అధ్యక్షడు రొనాల్డ్‌ రీగన్‌ భార్య. నటిగా, గాయనిగా, డ్యాన్సర్‌గా దాదాపు 70 ఏళ్లు రాణించిన మహిళ. ఆస్కార్‌ అందుకున్న నటి. ఆమే జానే వైమన్‌. పదహారేళ్లకే 1933లో వార్నర్‌ బ్రదర్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా నటిగా పరిచయమైంది. రోనాల్డ్‌ రీగన్‌ సరసన ‘బ్రదర్‌ ర్యాట్‌’ చిత్రాల్లో నటించింది. ‘పబ్లిక్‌ వెడ్డింగ్‌’, ‘బ్యాడ్‌మెన్‌ ఆఫ్‌ మిస్సోరీ’, ‘స్టేజ్‌ఫైట్‌’, ‘సోబిగ్‌’, ‘మ్యాగ్నిఫియెంట్‌ అబ్సెషన్‌’, ‘ఆల్‌ దట్‌ హెవెన్‌ ఎలౌస్‌’ లాంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ‘జానీ బెలిండా’ సినిమాతో ఆస్కార్‌ అవార్డుతో పాటు, మూడుసార్లు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్న నటి. రోనాల్డ్‌ రీగన్‌ను ఈమె 1940లో వివాహమాడి తొమ్మిదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. 1917 జనవరి 5, పుట్టిన ఈమె 2007 సెప్టెంబర్‌ 10న మరణించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.