‘తల పండిన’ నటుడు

గంభీరమైన కంఠంతో, విలక్షణమైన నటనతో వెండితెర, బుల్లితెరలపై ప్రాచుర్యం పొందాడు లీ మార్విన్‌. చిన్నతనంలో తల పండిపోవడంతో అలాగే నటించేవాడు. అదే అతడికి గుర్తింపు తెచ్చింది కూడా. ‘క్యాట్‌ బాలౌ’, ‘బిల్లీ బడ్‌’, ‘ఎస్కేప్‌’, ‘ద బిగ్‌స్టోరీ’, ‘ట్రెజరీ మెన్‌ ఇన్‌ యాక్షన్‌’, ‘యువార్‌ ఇన్‌ ద నేవీ నౌ’, ‘టెరెసా’, ‘డిప్లొమాటిక్‌ కొరియర్‌’, ‘ఉయ్‌ ఆర్‌ నాట్‌ మేరీడ్‌’, ‘ద బిగ్‌ హీట్‌’, ‘ద వైల్డ్‌ వన్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూయార్క్‌లో 1924 ఫిబ్రవరి 19న పుట్టిన మార్విన్, చదువుకునే రోజుల్లో ‘బ్యాడ్‌బాయ్‌’గా పేరు తెచ్చుకుని ఎన్నోసార్లు డిబార్‌ అయ్యాడం విశేషం. ఆపై మిలటరీలో చేరి క్రమశిక్షణ అలవరచుకుని అవార్డులు అందుకున్నాడు. ప్రపంచ యుద్ధం తర్వాత అనుకోకుండా ఓ నటుడు అనారోగ్యానికి గురవడంతో అతడికి బదులుగా ఓ నాటకంలో స్టేజి ఎక్కాడు. ఆపై నటన అతడిని ఆకర్షించింది. నటుడిగా ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్, ఎన్‌బీఆర్, సిల్వర్‌ బేర్‌ లాంటి అవార్డులు అందుకున్న మార్విన్, తన 63వ ఏట 1987 ఆగస్టు 29న అరిజోనాలో కన్నుమూశాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.