అందంతో అలరించి...

అందాల నటిగా ఆమె అలనాటి ప్రేక్షకులను అలరించింది. మంచి అభినేత్రిగా ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకొంది. ఆమే మేరీ మార్టిన్‌. నటిగా, గాయనిగా అభిమానులకు ఉర్రూతలూగించింది. టెక్సాస్‌లో 1913 డిసెంబర్‌ 1న పుట్టిన మార్టిన్‌ చిన్నప్పుడే గాయనిగా మెప్పించింది. ఆపై నాటకాల్లో పాత్రల ద్వారా ఆకట్టుకుంది. అమెరికన్‌ థియేటర్‌ హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్, కెనడీ సెంటర్‌ హానర్స్, డొనాల్డ్‌సన్, టోనీ, ఎమ్మీ లాంటి అవార్డులెన్నో కైవశం చేసుకుంది. ‘ద షాప్‌వోర్న్‌ ఏంజెల్‌’, ‘ద గ్రేట్‌ విక్టర్‌ హెర్బెర్ట్‌’, ‘రిథిమ్‌ ఆఫ్‌ ద రివర్‌’, ‘లవ్‌ థై నైబర్‌’, ‘కిస్‌ ద బాయిస్‌ గుడ్‌బై’, ‘బర్త్‌ ఆఫ్‌ ద బ్లూస్‌’లాంటి సినిమాల ద్వారా అందాల నటిగా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. పలు రంగాల్లో ప్రతిభ చూపిన ఈమె కాలిఫోర్నియాలో 1990 నవంబర్‌ 3న తన 76వ ఏట మరణించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.