నటనంటే అతడికి పిచ్చి!

ఓ పన్నెండేళ్ల పిల్లాడు తన తొలి నాటకంలోనే 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి, ప్రశంసలు అందుకున్నాడు. నటనా ప్రస్థానంలో అది అతడి తొలి అడుగు.
- తరువాత అతడు ప్రపంచంలోనే గొప్ప నటుడిగా పేరు పొందాడు.
- తొలి సినిమాకే ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నాడు.
అతడే ‘పాల్‌ముని’. ‘పాత్రలో ఒదిగిపోయాడని’ చాలా మంది గురించి అలవోకగా రాస్తుంటారు. కానీ ఆ ప్రశంస సరిగ్గా అతికినట్టు సరిపోయే గొప్ప నటుడు పాల్‌ముని. ‘నటన అతడికి వ్యాపకం కాదు... పిచ్చి’ అని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక శ్లాఘించింది. ఏదైనా పాత్ర ధరించాలంటే అతడు దాని మీద పెద్ద పరిశోధనే చేసేవాడు. మేకప్‌ పరంగా, శరీర భాష పరంగానే కాదు కంఠస్వరాన్ని కూడా పాత్రలకు అనుగుణంగా మార్చుకునేవాడు. ఎక్కువగా ప్రముఖుల బయోపిక్స్‌లో నటించాడు. ఆయా వ్యక్తుల గురించి పుస్తకాలు చదవడం, వారి సంబంధీకుల దగ్గరకు వెళ్లి వివరాలు రాబట్టడం చేసేవాడు. ‘ద స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌’ (1936) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. అతడు నటించిన ‘ద లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా’ చిత్రం 1937 ఆగస్టు 11న విడుదలై ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ప్రపంచంలోని గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.