భయానక నటుడు..

మూడు దశాబ్దాల పాటు హారర్‌ సినిమాల నటుడిగా గుర్తింపు పొందడం అంటే విచిత్రమే. ఆ ఘనత పీటర్‌ క్యుషింగ్‌దే. 1950ల నుంచి 70ల వరకు వచ్చిన అనేక భయానక చిత్రాల్లో పాత్రల ద్వారా ఆకట్టుకున్నాడు. డిటెక్టివ్‌ షెర్లాక్‌హోమ్స్‌ పాత్ర ద్వారా పలు సినిమాల్లో మెప్పించాడు. డ్రాకులా, స్టార్‌వార్స్, డాక్టర్‌ హూ చిత్రాల్లో పాత్రలు ఈయనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. స్టార్‌వార్స్‌-4 సినిమాలో ‘గ్రాండ్‌ మాఫ్‌ టార్కిన్‌’ పాత్ర ద్వారా యువతరం ప్రేక్షకులకూ అభిమానపాత్రుడయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ గుర్తింపు పొందారు. ఇంగ్లండ్‌లో 1913 మే 26న పుట్టిన ఇతడు, చిన్నప్పుడే నాటకాల ద్వారా ఆకట్టుకున్నాడు. దాదాపు 60 ఏళ్ల పాటు వివిధ పాత్రలు పోషించి మెప్పించిన ఈయన క్యాన్సర్‌ వల్ల 11 August, 1994లో మరణించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.