అక్కచెల్లెళ్లు వెండితెర తారలుగా అలరించడం మామూలే. తెలుగులో లలిత, పద్మిని, రాగిణి నుంచి బి. సరోజ, వైజయంతి మాల, షావుకారు జానకి, కృష్ణకుమారి నుంచి ఇలా ఎందరో అన్ని భాషా చిత్రాల్లోను కనిపిస్తారు. హాలీవుడ్లో కూడా ఇలాంటి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే పాలీ యాన్, సాలీ బ్లేన్, లొరెట్టా యంగ్ ఇలాంటి వాళ్లే. వీరిలో లొరెట్టా యంగ్ మాత్రం చిరకాలం సినిమాల్లో కొనసాగుతూ అందాల తారగా మంచి పేరు తెచ్చుకుంది. ‘ద ఫార్మర్స్ డాటర్’ సినిమాతో ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. టీవీల్లో ‘లొరెట్టా యంగ్ షో’ కార్యక్రమం ద్వారా ఎనిమిదేళ్లు ఆకట్టుకుంది. అమెరికాలో 1913 జనవరి 6న పుట్టిన లొరెట్టా యంగ్, రెండేళ్లకే మూకీ చిత్రాల్లో బాలనటిగా ప్రస్థానం ప్రారంభించింది. దశాబ్దాల పాటు నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె, కాలిఫోర్నియాలో 2000 ఆగస్టు 12న తన 87వ ఏట మరణించింది.