ఏ రంగమైనా అవార్డులు ఆమెవే!

రెం
డు ఆస్కార్‌ అవార్డులు, మూడు ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, ఓ స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు అందుకోవడంతో పాటు రెండు బాఫ్తా, ఓ టోనీ అవార్డులను నామినేషన్లు పొందిన ఘనత సాలీ ఫీల్డ్‌ది. బుల్లితెరతో ప్రయాణం మొదలు పెట్టి వెండితెరపై వెలుగులీనింది. ‘మూన్‌ పైలట్‌’, ‘స్టే హంగ్రీ’, ‘స్మోకీ అండ్‌ బండిట్‌’, ‘హీరోస్‌’, ‘ద ఎండ్‌’, ‘హోపర్‌’, ‘నోమా రే’, ‘ప్లేసెస్‌ ఇన్‌ ద హార్ట్‌’, ‘కిస్‌ మీ గుడ్‌బై’, ‘మర్ఫీస్‌ రొమాన్స్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’, ‘ఫారెస్ట్‌ గంప్‌’లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ సినిమాల్లో ఆన్ట్‌ మేరీ పాత్రలో మెప్పించింది. దర్శకురాలిగా కూడా బుల్లితెర, వెండితెరలపై ఆకట్టుకుంది. కాలిఫోర్నియాలో 1946 నవంబర్‌ 6న పుట్టిన ఈమె బాల్యం చేదు â్ఞ°పకాలతో నిండి ఉంది. సైనిక అధికారి అయిన తండ్రితో విడిపోయిన తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ మారుడు తండ్రి తనను లైంగికంగా వేధించడంతో ఇబ్బందులు పడింది. చివరకి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవడంతో కుదుట పడింది. చదువయ్యాక బుల్లితెరవైపు ఆకర్షితురాలైంది. ఆపై అంచెలంచెలుగా ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’ గౌరవం పొందే స్థాయికి ఎదిగింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.