అందం... అభినయం

నటిగా, మోడల్‌గా, చిత్రకారిణిగా రాణించి, ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖురాలిగా ఫెర్రా ఫాసెట్‌ను అలనాటి హాలీవుడ్‌ ప్రేమికులు గుర్తుంచుకుంటారు. స్విమ్‌స్యూట్‌ వేసుకుని వెనక్కి తిరిగి నవ్వుతున్న ఓ పోస్టర్‌ ద్వారా ఆమె అప్పట్లో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని ‘పిన్‌అప్‌’ పోస్టర్‌ అంటారు. గొప్ప టీవీ తారల్లో ఒకరుగా ఆమె పేరు ఇంటింటా మార్మోగింది. నాటకాల వేదికలపై ఆకట్టుకుంది. టెక్సాస్‌లో 1947లో పుట్టిన ఆమె ‘ఎక్స్‌ట్రీమిటీస్‌’, ‘ద బర్నింగ్‌ బెడ్‌’, ‘స్మాల్‌ శాక్రిఫైజెస్‌’, ‘ద అపోసైట్‌’ లాంటి సినిమాలతో మెప్పించింది. తన 62వ ఏట 2009లో కాలిఫోర్నియాలో మరణించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.