హాలీవుడ్‌ పితామహుడు!
ఆయన...‘ఫాదర్‌ ఆఫ్‌ ద సినిమా ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టే’గా పేరొందాడు!
వ్యాపారాత్మకంగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాతగా కీర్తి గడించాడు!
గొప్ప దృశ్యకావ్యాలుగా, భారీతనంతో కూడిన చిత్రాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాడు!


ఆయనే... సెసిల్‌ బి.డెమిల్లే. ఇలా చెబితే తెలియడం కష్టమే. కానీ ’ లాంటి చిత్రాల రూపకర్తగా చెబితే జేజేలు పలుకుతారు. 1914 నుంచి 1958 వరకు ఆయన మొత్తం 70 చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించాడు. తొలి సినిమా ‘ద స్క్వా మ్యాన్‌’తోనే హాలీవుడ్‌కే గుర్తింపు తెచ్చిన డెమిల్లే ఆ తరువాత భాగస్వాములతో కలిసి ‘ప్యారమౌంట్‌ పిక్చర్స్‌’ సంస్థను స్థాపించాడు. ‘ద గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌’ (1952) సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకుంది. ‘ద టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 7వ స్థానంలో నిలించింది. సినీ రంగానికి సేవలకుగాను డెమిల్లే గౌరవ ఆస్కార్‌ అవార్డును అందుకున్నాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.