వెన్నెల పంచిన ప్రతిభ!

అది వెండితెరపై ‘చందమామ’ అయినా... పిల్లల చేతిలో ‘చందమామ’ అయినా... ఆ వెన్నెల మాత్రం చక్రపాణిదే! రచయితగా, సంపాదకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ చరిత్రలో చిరస్థాయిగా చెప్పుకోదగిన వ్యక్తులో చక్రపాణి ఒకరు. తెనాలి దగ్గరి ఐతానగర్‌ గ్రామంలో 1908 ఆగస్టు 5న ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చక్రపాణి బహుభాషావేత్తగా ఎదిగారు. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర సాహిత్య వెన్నెలలను తెలుగు పాఠకులకు అందించారు. వాహని స్టూడియోస్, విజయ ప్రొడక్షన్స్‌ అందించిన ఎన్నో జనరంజక చిత్రాల వెనుక చక్రపాణి సృజనాత్మక భాగస్వామ్యం ప్రముఖ పాత్ర వహించింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.