తొలి హాస్య తొలకరులు ఆయనవే!

దర్శకుడు ఓ సినిమా తీయాలని సంకల్పించాడు. సహాయ దర్శకుడు సహకరిస్తున్నాడు. కథానాయకుడిగా ఎవరూ కుదరడం లేదు. విసిగిపోయిన దర్శకుడు ‘ఆ పాత్ర నువ్వే ఎందుకు వేయకూడదు?’ అని సహాయ దర్శకుడిని అడిగాడు. ‘నా వల్ల కాదు బాబోయ్‌...’ అన్నాడు సహాయ దర్శకుడు. దర్శకుడు ఒప్పుకోలేదు. అలా తెరవెనుక నుంచి తెర మీదకి వచ్చిన అతడు, తెలుగులో తొలి హాస్య కథానాయకుడిగా మారాడు. అతడే లంక సత్యం. ఆ సినిమా 1940లో వచ్చిన ‘బారిష్టర్‌ పార్వతీశం’. మొక్కపాటి నరసింహ శాస్త్రి రాసిన ఈ నవలను సినిమాగా తీద్దామనుకున్న దర్శకుడు, తెలుగులో మొదటి మూకీ నిర్మించిన రఘుపతి వెంకయ్య కుమారుడు ప్రకాష్‌. అలా తొలి హాస్య కథానాయకుడైన లంక సత్యం పలు చిత్రాల్లో నటిస్తూనే దర్శకుడు కూడా అయ్యారు. ఆగస్టు 4 ఆయన జయంతి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.