ఈ సంకెళ్లు ఎవరి కోసం!
సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ ఇద్దరు సంకెళ్లు పట్టుకొని ఉన్నారు. ఇంతకీ వీరిద్దరు ఎవరి చేతులకు బేడీలు వేయాలని అంత సీరియస్‌గా చూస్తున్నారో తెలియడం లేదు. ఈ చిత్రంలో మరో జాతీయ నటుడు కూడా ఉన్నారు. ఆయనే కమల్‌హాసన్‌. ఈ త్రిమూర్తులు కలిసి నటించిన ఆ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం. మీకో క్లూ కూడా ఇస్తున్నాం. దర్శకుడి పేరు ప్రయాగ్‌ రాజ్‌. చిత్రానికి సంగీతం అందిందిచింది బప్పిలహరి. ఇక చిత్రం పేరు కనిపెట్టడమే మీ పని..




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.