హరీష్ చూపిస్తున్న ఈ నాయిక ఎవరు?
క్రేజీ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ నెటిజన్లకు తాజాగా ఓ ఫజిల్‌ విసిరారు. తన తాజా చిత్రం ‘వాల్మీ’కిలో నటిస్తోన్న కథానాయిక ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘ఈ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి’’ అంటూ ప్రశ్నను సంధించారు. ఇది వాస్తవానికి చాలా సులభంగా చెప్పేసే సమాధానమే అయినప్పటికీ.. చాలా మంది కన్ఫ్యూజన్‌లో రకరకాల పేర్లు చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇందులో వరుణ్‌ తేజ్‌తో పాటు మరో తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలు పోషిస్తుండటమే కారణం. అందుకే హరీష్ చూపించింది అధర్వ జోడీ ఏమో అనుకోని రకరకాల పేర్లు సమాధానమిచ్చారు. ఇక నెట్టింట జరుగుతున్న ఈ కన్ఫ్యూజన్‌ గోల మరింత ముదరనీయడం ఎందుకనుకుందో ఏమో.. కొద్దిసేపటి క్రితమే ఆ ఫొటో తనదేనంటూ క్లారిటీ ఇచ్చేసింది సదరు ముద్దుగుమ్మ. మరి సులభంగా కనిపెట్టేయగల ఈ కథానాయిక ఎవరో మీరు చెప్పండి చూద్దాం..



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.