బికినీలో కిర్రాకు పుట్టిస్తున్న ఈ తార ఎవరు?
ప్పుడే పాల సంద్రం నుంచి బయటకొచ్చిన సాగరకన్యలా ఎంత మత్తెక్కిస్తుందో కదా ఈ అమ్మడు. సన్నజాజి లాంటి నడుముతో కారు మబ్బుల్లాంటి కురులతో కళ్ల నిండా మత్తెక్కించే మకరందాన్ని నింపుకోని హాట్‌ హాట్‌గా సోషల్‌మీడియాలో హీటు పుట్టిస్తోంది. అయితే ఇప్పుడింత నాజూగ్గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైకి వచ్చిన కొత్తలో బొద్దుగుమ్మలా ఉండేదంటే ఆశ్చర్యపోతారు. కానీ, కొన్నాళ్లుగా తన ఫిజిక్‌పై పూర్తిగా దృష్టి సారించిన ఈ అమ్మడు.. నెలలకు నెలలు జిమ్‌లో కసరత్తులు చేసి ఈ సన్నని సొగసుల రూపాన్ని సంపాదించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ హెల్త్‌కేర్‌ మ్యాగజైన్‌ కోసం ఇలా బికినీలో ఫొటో షూట్‌ ఇచ్చింది. వీటిని తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. ‘‘ఫలితం కావాలంటే ఓర్పు.. పోరాటం.. శ్రమ అన్నీ ఉండాలి. మార్పు అనేది సమర్పణ.. బలం అనే రెండు అంశాల సమాహారం’’ అంటూ ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని కూడా దానికి జత చేసింది. ప్రస్తుతం దీనికి నెట్టింట లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?

క్లూ: ఈమె ‘తొలిప్రేమ’ కబుర్లు తెలుసుకోవడానికి కుర్రకారుకు ఎనలేని ఆసక్తి చూపిస్తుంటారు...
 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.