ఫిబ్రవరి 3.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సుస్వరాల రాజు
(సంగీత దర్శకుడు చక్రవర్తి వర్థంతి)



ప్రతిభలేని వారికి వచ్చిన అవకాశమే గొప్పది. కానీ ప్రతిభాశాలికి ఏ దారి ఎన్నుకోవడమనేది సమస్యే. మిమిక్రీ, గానం, దర్శకత్వం, స్వరకల్పన... ఏ దారిలో వెళ్లాలనే సమస్య వచ్చింది చక్రవర్తికి. చివరకి సరైన దారినే ఎంచుకున్నారు. ఆ దారిలో సంచలన ముద్రనే వేశారు. జనాదరణ పొందిన ఎన్నో పాటలను సినీ సంగీత అభిమానుల నాలుకల మీద నాట్యం చేసేలా స్వరపరిచి చిరస్మరణీయుడయ్యారు. మరి ఈ ప్రతిభాశాలి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందామా?


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* రైళ్లో రసాభాస!

సినిమా అంతా రైళ్లోనే సాగుతుంది. అందులోనే ఓ అందమైన అమ్మాయి... ఆమెతో సాన్నిహిత్యం కోసం కొందరి ప్రయత్నాలు... మధ్యలో యుద్ధ వాతావరణం... సైనిక అధికారుల తనిఖీలు... ఉత్కంఠ... ఇలా చకచకా సాగిపోయే సినిమా ‘షాంగై ఎక్స్‌ప్రెస్‌’ (1932) సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలాంటి రైలు సినిమాలు ఎన్నో భాషల్లో రావడానికి నాంది పలికింది. ఇందులో నటించిన మారీన్‌ డైట్రిచ్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సినిమా అప్పట్లో ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ 3.7 మిలియన్‌ డాలర్లు కురిపించింది. ఈ సినిమానే 1942లో ‘నైట్‌ ప్లేన్‌ ఫ్రం చంగ్‌కింగ్‌’గాను, 1951లో ‘పెకింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’గాను రీమేక్‌ చేశారు.

* ఆస్ట్రేలియా నుంచి హాలీవుడ్‌కి...


రేళ్ల నుంచే టీవీ కార్యక్రమాల్లో మెరిసిన ఆస్ట్రేలియా పాప హాలీవుడ్‌ చేరి తారగా తళుకులీనింది. ఆమే ఇస్లా ఫిషర్‌. ఒమన్‌లో 1975లో పుట్టిన ఈమె ‘స్కూబీడూ’ (2002) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆపై ‘వెడ్డింగ్‌ క్రాషర్స్‌’, ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షాప్‌హాలిక్‌’, ‘ద గ్రేట్‌ గట్స్‌బై’, ‘నౌ యు సీ మీ’, ‘ఐ హార్ట్‌ హకబీస్‌’, ‘ద లాకౌట్‌’, ‘హార్టన్‌ హియర్స్‌ ఎ హూ’, ‘అరెస్టెడ్‌ డెవలప్‌మెంట్‌’లాంటి సినిమాల్లో అందాల అభినేత్రిగా పేరు పొందింది. ఈమె రచయిత్రి కూడా. ‘మెర్జ్‌ ఇంఛార్జి’ పుస్తకాల పరంపరను వెలువరించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.