మార్చి 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* రాజకీయ వ్యంగాస్త్రం

(పెద్ద మనుషులు సినిమా)



(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* కళాతపస్వి తొలి దర్శకత్వం   

(ఆత్మగౌరవం సినిమా)

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అమెరికా అందం


తొమ్మిదేళ్లయినా లేకుండానే సినిమా అవకాశం రావడం అరుదైన విషయం అనుకుంటే, ఆ తొలి సినిమాతోనే అవార్డు అందుకోవడం మరీ అరుదైన విశేషం. ఆ అరుదైన నటే థోరా బిర్చ్‌. అయిదు ఆస్కార్‌ అవార్డులు అందుకున్న ‘అమెరికన్‌ బ్యూటీ’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి. కాలిఫోర్నియాలో 1982 మార్చి 11న పుట్టిన థోరా, ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ‘పర్పుల్‌ పీపుల్‌ ఈటర్‌’ సినిమా అవకాశం పొంది, ‘యంగ్‌ ఆర్టిస్ట్‌ అవార్డు’ అందుకుంది. ఆపై ‘ఆల్‌ ఐ వాంట్‌ ఫర్‌ క్రిస్ట్‌మస్‌’, ‘పేట్రియట్‌ గేమ్స్‌’, ‘హోకస్‌పోకస్‌’, ‘మంకీ ట్రబుల్‌’, ‘నౌ అండ్‌ దెన్‌’, ‘అలాస్కా’ సినిమాల్లో బాలతారగా ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులో నటించిన ‘అమెరికన్‌ బ్యూటీ’ తర్వాత ఆమె పేరు మార్మోగిపోయింది. ఆపై ‘ఘోస్ట్‌ వరల్డ్‌’, ‘హోమ్‌లెస్‌ టు హార్వర్డ్‌: ద లిజ్‌ ముర్రేస్టోరీ’, ‘డంగియన్స్‌ అండ్‌ డ్రాగన్స్‌’, ‘వింటర్‌ ఆఫ్‌ ఫ్రాజెన్‌ డ్రీమ్స్‌’, ‘పెట్యూనియా’లాంటి సినిమాల్లో మెప్పించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.