నవంబర్‌ 8.. (సినీ చరిత్రలో ఈరోజు)

 యూరప్‌ను కాపాడిన బాండ్‌!


ఓ చమురు వ్యాపారి హత్యకు గురయ్యాడు. అతడి కూతురు ప్రమాదంలో ఉంది. అంతేనా? యూరప్‌ దేశాలకు చమురు సరఫరా చేసే పైప్‌లైన్‌ను పేల్చేయాలని దుండగులు ప్రయత్నిస్తున్నారు. అదిగానీ పేలితే యూరప్‌ మొత్తం నాశనం అయిపోతుంది. అయ్యబాబోయ్‌... ఎలా? కంగారేమీ అక్కర్లేదు... జేమ్స్‌బాండ్‌ ఉన్నాడుగా?! తమ స్వార్థానికి ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ అంటూ రెచ్చిపోతున్న దురాశాపరుల ఆటకట్టించడానికి బాండ్‌ హుటాహుటిన బయల్దేరాడు. వెండితెరపై ఒళ్లు గగుర్పొడిచిన పోరాటాలు, ఛేజింగ్‌లు, ఎత్తులు పైఎత్తుల మధ్య అందరి ఆట కట్టించేశాడు. బాండ్‌ పాత్రలో పియర్స్‌ బ్రాస్నన్‌ మూడోసారి నటించిన ఈ సినిమా 1999 నవంబర్‌ 8న విడుదలై 362 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.


 ‘తుత్తి’గా నవ్వించాడు! (ఏవీఎస్‌ వర్థంతి-2013)


ఆయన పేరు ఆమంచి సుబ్రహ్మణ్యం. అందరి చేతా ‘మామంచి’ సుబ్రహ్మణ్యం అనిపించుకున్నారు. తొలి సినిమా ‘మిస్టర్‌ పెళ్లాం’తోనే మంచి హాస్య నటుడిగా ‘తుత్తి’ కలిగించారు. కమేడియన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, జర్నలిస్టుగా బహుముఖ ప్రజ్ఞ చూపించిన ఏవీఎస్, తెనాలిలో 1957 జనవరి2న పుట్టారు. ‘మిస్టర్‌ పెళ్లాం’ సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టి విలక్షణ హాస్యనటుడిగా పేరు పొందారు. ఎన్నో పాత్రలను తనదైన శైలితో, ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో మెప్పించిన ఏవీఎస్‌ తన 56వ ఏట 2013 నవంబర్‌ 8న మరణించారు. ఈరోజు ఆయన వర్థంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


© Sitara 2018.
Powered by WinRace Technologies.