ఆస్ట్రేలియా నుంచి హాలీవుడ్‌కి...

ఆరేళ్ల నుంచే టీవీ కార్యక్రమాల్లో మెరిసిన ఆస్ట్రేలియా పాప హాలీవుడ్‌ చేరి తారగా తళుకులీనింది. ఆమే ఇస్లా ఫిషర్‌. ఒమన్‌లో 1975లో పుట్టిన ఈమె ‘స్కూబీడూ’ (2002) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆపై ‘వెడ్డింగ్‌ క్రాషర్స్‌’, ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షాప్‌హాలిక్‌’, ‘ద గ్రేట్‌ గట్స్‌బై’, ‘నౌ యు సీ మీ’, ‘ఐ హార్ట్‌ హకబీస్‌’, ‘ద లాకౌట్‌’, ‘హార్టన్‌ హియర్స్‌ ఎ హూ’, ‘అరెస్టెడ్‌ డెవలప్‌మెంట్‌’లాంటి సినిమాల్లో అందాల అభినేత్రిగా పేరు పొందింది. ఈమె రచయిత్రి కూడా. ‘మెర్జ్‌ ఇంఛార్జి’ పుస్తకాల పరంపరను వెలువరించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.