కేన్స్‌లో కేక పెట్టిస్తోన్న ప్రియాంక
View this post on Instagram

Clearly can’t do a @bellahadid #goals! 😂@mimi Ure too funny! ❤️ @patidubroff @daniellepriano @maxeroberts

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


కేన్స్‌లో ప్రియాంక చోప్రా పంచుతోన్న సొగసుల విందు రోజురోజుకూ మరింత హీటెక్కిస్తోంది. ఇప్పటికే అరడజనుకు పైగా కిరాకు పుట్టించే అవతారాలతో రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించిన ఈ అమెరికన్‌ కోడలు తాజాగా మరింత సెగలు రేపింది. నలుపురంగు మెటాలిక్‌ ఔట్‌ ఫిట్‌లో ఓ వైపు క్లీవెజ్‌ అందాలతో కైపెక్కిస్తూ.. మరోవైపు కుర్రాళ్ల గుండెల్లో అగ్గిరాజేసేలా ఉరువుల సౌందర్యాన్ని ఎరగా వేసి బోల్డ్‌లుక్‌తో మెస్మరైజ్‌ చేసింది. ఇక ప్రియా ముద్దుల మొగుడు నిక్‌ జోనాస్‌ చాలా సింపుల్‌గా బ్లాక్‌డ్రెస్‌.. జిగ్‌ జాగ్‌ సూటులో స్టైలిష్‌గా ఫొజిచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా వీడియోకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. బోల్డ్‌ క్వీన్‌.. డస్కీ బ్యూటీ.. అంటూ ప్రియా అందాలపై రొమాంటిక్‌ కామెంట్లు పెట్టేస్తున్నారు.


ఐష్‌.. బంగారు సాగరకన్యలా..
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ కేన్స్‌కు వచ్చేశారు. ఈసారి కూడా తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన సందడి చేశారు. జీన్‌ లూయి సబాజీ డిజైన్‌ చేసిన గోల్డెన్‌ గ్రీన్‌ ఫిష్‌ కట్‌ గౌనులో ఐష్‌ సాగరకన్యలా మెరిసిపోయారు. ఆరాధ్య కూడా తన తల్లిలాగే లేత పసుపు రంగు గౌనులో ముస్తాబైంది. ఐశ్వర్య ఎన్నో ఏళ్లుగా కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ 72వ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో భారత్‌ నుంచి కంగనా రనౌత్‌, డయానా పెంటీ, ప్రియాంక చోప్రా, హీనా ఖాన్‌, దీపికా పదుకొణె, హుమా ఖురేషీ హాజరై సందడి చేశారు. ఇక సోనమ్‌ కపూర్‌ రావడమే తరువాయి.


మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.