పెళ్లయితే ఏంటి? కాకపోతే ఏంటి?

హాలీవుడ్‌లో ప్రేమ, పెళ్లి సంగతులు చిత్రంగానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ హాలీవుడ్‌ నటి, గాయని హిల్లరీ డఫ్‌ వ్యవహారం. ఈమె, తన ప్రియుడైన పాప్‌ సింగర్‌ మాథ్యూ కోమాను మూడో కంటికి తెలియకుండా పెళ్లి చేసుకొందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దగరూ గత కొన్నేళ్లుగా డేటింగ్‌ చేసి, ఉంగరాలు మార్చుకున్నారు. రహస్య వివాహం గురించి నటి హిల్లరీ డఫ్‌ ఓ ప్రకటన కూడా చేసింది. ‘‘ఇప్పటి వరకు మేము నిశ్చితార్థం మాత్రమే చేసుకొన్నాం. ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఎప్పుడు ఎక్కడ చేసుకోవాలనే దానిపై మా ఇద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయి. అయినా నిశ్చితార్థం జరిగాక, పెళ్లైతే ఏంటి? కాకపోతే ఏంటి? కొన్ని విషయాలు అలా జరిగిపోతుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. అదీ సంగతి. అన్నట్టు... హిల్లరీ ‘హ్యుమన్‌ నేచర్‌’, ‘ఏ సిండ్రెల్లా స్టోరీ’, ‘ఫుడ్‌ఫైట్‌’లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తెరపైకి వచ్చిన ‘హంటింగ్‌ ఆఫ్‌ షరాన్‌ టేట్‌’ అనే చిత్రానికి నటిస్తూ, సహనిర్మాతగా పనిచేసింది.

                                       


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.