పాటలు పాడుతూ సినిమాల్లోకి!

ఏడేళ్లకే పాటలు పాడుతూ ఆకట్టుకున్న ఓ అమ్మాయి, గాయనిగా పేరుతెచ్చుకుని సినమాల్లో నటిగా మారి ‘ఆస్కార్‌’ అవార్డు పొందడం అరుదైన విషయమే. ఆ అమ్మాయే జెన్నిఫర్‌ హడ్సన్‌. గాయనీగాయకుల వేదికగా పేరొందిన ‘అమెరికన్‌ ఐడల్‌’ పోటీల్లో ఏడవ స్థానంలో నిలిచి, ఎలిమినేషన్‌ తర్వాత సినిమా అవకాశాలు పొంది, వెండితెరపై నటిగా రాణించింది. 1981 సెప్టెంబర్‌ 12న షికాగోలో పుట్టిన జెన్నిఫర్‌ హడ్సన్‌ ‘డ్రీమ్‌గర్ల్స్‌’ (2006) సినిమాకు ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌ అందుకుంది. అలాగే గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులను కూడా సాధించింది. ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ’, ‘ద సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ బీస్‌’, ‘బ్లాక్‌ నేటివిటీ’ సినిమాల ద్వారా గుర్తింపు పొందింది. గాయనిగా గ్రామీ అవార్డు సాధించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్నేహితురాలిగా గుర్తింపు పొంది వైట్‌హౌస్‌లో ప్రదర్శన ఇచ్చింది.
                                                        
© Sitara 2018.
Powered by WinRace Technologies.