జెన్నీఫర్‌ లారెన్స్‌ ఎంగేజ్‌మెంట్‌

హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ లారెన్స్‌ న్యూయార్క్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరక్టర్‌ కూకి మర్నీతో ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఈ కొత్త ప్రియుడు హంగులు ఆర్బాటాలకు దూరంగా, తక్కువ ప్రచారంలో ఉండే వ్యక్తి. ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆస్కార్‌ విజేత జెన్నీఫర్‌ లారెన్స్‌ గతంలో నికోలస్‌ హాల్ట్‌తో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే ఇండియాలో సుచీలీక్స్‌లా హాలీవుడ్‌ ‘ఐక్లౌడ్‌ లీక్స్‌ ఆఫ్‌ సెలబ్రీట్‌’ అనే పేరుతో వీరిద్దరు కలిసున్న కొన్ని వ్యక్తిగత ఫొటోలు లీకయ్యాయి. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో వీరిమధ్య బంధం బలహానపడి తెగిపోయిందని సమాచారం. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని ఆపిల్‌ ఇంక్‌ అనే సంస్థపై దావా కూడా వేసింది. కొన్నాళ్ల తరువాత జెన్నీ దర్శకుడు డారెన్‌ అర్నోస్ఫ్‌కితో 2016లో డేటింగ్‌ చేస్తూ ఉంది. ఆ వ్యవహారం నవంబర్‌ 2017 దాకా కొనసాగింది. ప్రస్తుత ప్రియుడు కూకి మర్నీతో 2018 సంవత్సరం నుంచి కొనసాగుతున్న బంధానికి గుర్తుగా ఇప్పుడు ఫిబ్రవరి 2019లో ఎంగేజ్‌మెంట్‌తో ఇద్దరు ఒకటయ్యారు. ప్రస్తుతం జెన్నీఫర్‌ సైమన్‌ కిన్‌బెర్గ్‌ దర్శకత్వంలో ‘డార్క్‌ ఫోనిక్స్‌’ చిత్రంలో నటిస్తుంది.

                           





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.