ప్రేమకు సమయం లేదు

ప్రఖ్యాత నటి, నిర్మాత పారిస్‌ హిల్టన్‌ ప్రేమించడానికి సమయం లేదంటోంది. ముఫ్పైఎనిదేళ్ల ఈ ముదరు భామ గత సంవత్సరంలోనే నటుడు క్రిస్‌ జిల్కాతో నిశ్చితారం అయింది. అయినా ఆ బంధం కొన్నాళ్లు కూడా నిలబడలేదు. ఇదే విషయాన్ని హిల్టన్‌ అడిగితే..నాకేం ఇదొక్క పనే కాదు. చాలా పనులున్నాయి. వ్యాపారం, స్నేహితులు అందరూ ఉన్నారు. వాళ్ల కోసం నా సమయాన్ని కెటాయిస్తా. అంతే కానీ ప్రేమకు, పెళ్లిల్లకు ఖర్చు చేసే సమయం నా దగ్గర లేదని చెబుతోంది. అంతేకాదు సంవత్సరంలో నేను రెండు వందల యాభైరోజులు వ్యాపారానికో, స్నేహితుల కోసమే నా ప్రయాణం సరిపోతుంది. ఇక నాకు ఖాళీ ఎక్కడ ఉంది చెప్పండి. ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో ఎవరు మనకు దగ్గరివారో, పరాయివారో తెలుసుకోవడం కష్టమౌతుందని నిట్టూర్చింది. ‘వన్‌నైట్‌ ఇన్‌ పారిస్‌’, ‘జూలండర్, ‘నైన్‌ లివ్స్‌’, ‘ది అమెరికన్‌ మెమే’లాంటి చిత్రాల్లో నటించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.