వన్నెచిన్నెల అందాలు..

ఓవైపు మోనాలీసా.. మరోవైపు బాపు బొమ్మ.. జీవం పోసుకొని ముందుకొచ్చి నిలబడితే ఎవరి చూపైనా ఎటుపోతుందంటే? ఏం చెప్పగలం. రెండూ చూపుతిప్పుకోనివ్వని అందాలే. దివిలోని తళుకు తారకలన్నీ నేలపై కుప్పపోసినట్లు ఓచోట చేరితే ఆ అద్భుత సన్నివేశాన్ని ఏమని వర్ణించగలం.. చూసి తరించడం తప్ప. మరి ఇలాంటి అపురూప దృశ్యాలే ఒక్కసారిగా కనిపిస్తే.. చూసేవవారికి కనుల విందు కాక ఇంకేం ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలను చూస్తే ఇది నిజమే కదా అనిపించక మానదు. ప్రియాంక ఇటీవలే టిఫానీ అండ్‌ కో బుక్‌ కలెక్షన్‌ లాంచ్‌ కోసం న్యూయార్క్‌కు వెళ్లింది. ఈ కార్యక్రమంలోనే ఆమెకు నటి కిమ్‌ కర్దాషియాన్‌ లే కూడా తారసపడింది. అయితే ఊహించని విధంగా కిమ్‌ను అక్కడ కలవడంతో ప్రియాంక సంతోషం పట్టలేక పోయింది. కిమ్‌ కూడా పీసీని ‘పెట్ట్రీ’ అని అభివర్ణిస్తూ హగ్‌ ఇచ్చినంత పని చేసిందట. తర్వాత వీరిద్దరూ కలిసి కార్యక్రమంలో సరదాగా గడిపారట. ఈ సందర్భంగా వీరిద్దరూ వారి స్నేహితులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. తాజాగా ఈ ఫొటోలనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఈ ఫొటోలో ప్రియాంక, కిమ్‌ల ఫ్యాషన్‌ దుస్తులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కిమ్‌.. షైనీ వైట్‌ కటౌట్‌ గౌనులో మెరవగా, ప్రియాంక.. ష్యాషన్‌ డిజైనర్‌ జార్జియా అర్మానీ రెడీ చేసిన సిల్వర్‌ కలర్‌ గౌనులో తళుక్కుమనిపించింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.