వెనుకబడిపోయిన సెలీనా గోమోజ్‌!

హాలీవుడ్‌ నటిమణి, సింగర్‌ అరినా గ్రాండో ఇప్పుడు మరో గాయని, నటి, నిర్మాత అయినా సెలీనా గోమోజ్‌ను దాటుకొని వెళ్లిపోయింది. ఇంతకీ ఎందులో సెలీనా కంటే అరీనా ముందువరుసలో ఉందంటే? ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అనుసరించే వారి సంఖ్య అరినానే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. అరినా గ్రాండో అనుసరించేవారి సంఖ్య 146,286,173 కాగా, సెలీనా అనుసరించేవారు 146,267,801 ఉన్నారు. ఇలా చిన్న తేడాతో సెలీనా వెనుకబడింది. అరినా కంటే సెలీనా వెనకబడటానికి కారణం ఆ మధ్య కాలంలో కొంత అనారోగ్యంతో ఉండటం చేత సెలీనాకు అనుచరుల సంఖ్య తగ్గిందని చెప్పుకుంటున్నారు. సెలీనా ‘స్టార్స్‌ డ్యాన్స్‌’, ‘రివైవల్‌’లాంటి సోలో ఆల్బమ్స్‌ చేసింది. ‘ది బిగ్‌ షార్ట్‌’, ‘ది ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కారింగ్‌’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘ఎ రెయిన్‌ డే ఇన్‌ న్యూయార్క్‌’, ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ చేస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.