రెండు ఆస్కార్ అవార్డులు... మూడు గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు... ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు... రెండు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు... వీటితో పాటు యాక్షన్ హీరోగా, విలక్షణ నటుడిగా అంతర్జాతీయ గుర్తింపు! ఇవీ... హాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, రీ. లి. ళ్చీi్ణ్చఃసంగీతకారుడు కెవిన్ మైకేల్ కాస్టనర్ సంపాదించుకున్న ప్రశంసలు. కాలిఫోర్నియాలో 1955లో పుట్టిన కాస్టనర్ ‘సిజ్జీ బీచ్, యూఎస్ఏ’ (1981) చిత్రంతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ‘ద అన్‌టచబుల్స్’, ‘వాటర్ వరల్డ్’, ‘బుల్ దుర్హమ్’, ‘ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్’, ‘డ్యాన్సెస్ విత్ వూల్వ్స్’, ‘జేఎఫ్‌కే’, ‘రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్’, ‘ద బాడీగార్డ్’, ‘మెస్సేజ్ ఇన్ ద బాటిల్’, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’, ‘మోలీస్ గేమ్’ లాంటి చిత్రాలతో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.