అవార్డుల నటుడు!

రెండు ఆస్కార్‌, ఆరు గోల్డెన్‌ గ్లోబ్‌, నాలుగు బాఫ్తా, మూడు డ్రామా డెస్క్‌, రెండు ఎమ్మీ, ఒక జెనీ, ఒక థియేటర్‌ వరల్డ్‌, ఒక జీవిత సాఫల్య, ఒక అంతర్జాతీయ ఎమ్మీ, ఒక కెనెడీ సెంటర్‌ హానర్స్‌... ఇవన్నీ ఏంటి? ఓ నటుడు సాధించిన అవార్డులు. ఆ నటుడే డస్టిన్‌ లీ హాఫ్‌మ్యాన్‌. నటుడిగా, దర్శకుడిగా నాటకరంగం, టీవీ, సినిమాల్లో తనదైన ముద్రవేసిన ఇతడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎక్కువగా విలన్‌ పాత్రల్లో విలక్షణత చూపించాడు. ‘క్రామెర్‌ వర్సెస్‌ క్రామెర్‌’ (1980), ‘రైన్‌మ్యాన్‌’ 1989), ‘ద గ్రాడ్యుయేట్‌’, ‘మిడ్‌నైట్‌ కౌబాయ్‌’, ‘లిటిల్‌ బిగ్‌ మ్యాన్‌’, ‘స్ట్రా డాగ్స్‌’, ‘పాపిలాన్‌’ ‘హుక్‌’ సినిమాల్లో నటనకు మంచి గుర్తింపు సాధించాడు. ‘క్వారెట్‌’ సినిమాతో దర్శకుడయ్యాడు.© Sitara 2018.
Powered by WinRace Technologies.