కొత్త జేమ్స్‌ బాండ్‌ దొరికాడు

జేమ్స్‌ బాండ్‌ సినిమాలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒక బాండ్‌ సినిమా పూర్తికాగానే వచ్చే సినిమాలో బాండ్‌గా నటించే నటుడిని ఎంపిక చేస్తారు. కొత్త బాండ్‌ ఎవరనే విషయంపై కొద్ది నెలలుగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అది ఎవరో తేలిపోయింది. రాబోయే బాండ్‌ సినిమాల్లో హీరోగా హెన్రీగోల్డింగ్‌ నెక్ట్స్‌ నటించబోతున్నారు. మలేషియాకు చెందిన హెన్రీ బీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ది ట్రావెల్‌ షో’ ప్రయోక్త. ‘క్రేజీ రిచ్‌ ఏషియన్‌్్స సినిమాలో ‘నిక్‌ యంగ్‌’ పాత్రధారిగా ప్రేక్షకులకు సుపరిచితుడు. పలు టీవీ ఛానెళ్లలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ‘హాట్‌ గై’ గా సెకెండ్‌ షౌట్‌ అవార్డును సాధించారు. హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించారు. జేమ్స్‌ బాండ్‌ కథాంశంగా ఇప్పటికి హాలీవుడ్‌లో 24 సినిమాలు వచ్చాయి. తాజాగా జోజిఫుకునాగ దర్శకత్వంలో 25వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో డేనియల్‌ క్రెయిగ్‌ జేమ్స్‌ బాండ్‌గా కనిపించబోతున్నారు. గతంలో వచ్చిన నాలుగు బాండ్‌ సినిమాల్లో క్రెయిగ్‌ నటించాడు. ఇప్పుడు రాబోతున్న సినిమా ఐదవది, బాండ్‌ సిరీస్‌లో క్రెయిగ్‌ ఆఖరు సినిమా ఇదే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.