అరుదైన అభినయం!

ఒకే సినిమాకి మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందడం అరుదైన విషయమే. అదే సాధించాడు హాలీవుడ్‌ నటుడు నికొలాస్‌ కేజ్‌. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఎన్నో సినిమాల్లో యాక్షన్‌ హీరోగా, అభినయ ప్రాధాన్యమైన పాత్రలతో మెప్పించిన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పేరు సంపాదించాడు. కాలిఫోర్నియాలో 1964 జనవరి 7న పుట్టిన నికొలాస్‌ కిమ్‌ కొప్పాలాకి చిన్నప్పటి నుండే నటుడవ్వాలనే కోరిక ఉంది. తండ్రి ఫ్రొఫెసర్‌. తల్లి కొరియోగ్రాఫర్‌. బాబాయ్‌ ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా దర్శకుడు. చదువుకునేప్పుడే నాటకాల్లో వేషాలు వేసిన నికొలాస్‌ నటనకు తగిన శిక్షణ తీసుకున్నాక బాబాయ్‌ దగ్గరకు వెళ్లి ‘నాకు అవకాశం ఇయ్యి. నటనంటే ఏమిటో చూపిస్తాను’ అంటూ అడిగి అదే ఆత్మవిశ్వాసంతో సినిమాల్లోకి ప్రవేశించాడు. తన పేరును నికొలాస్‌ కేజ్‌గా మార్చుకుని తొలిసారిగా ‘ఫాస్ట్‌ టైమ్స్‌ ఎట్‌ రిడ్జిమాంట్‌ హై’ (19782)తో వెండితెరకు పరిచయమై చిన్న చిన్న పాత్రలు వేశాడు. ‘లీవింగ్‌ లాస్‌ వెగాస్‌’ (1995)లో నటనకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు పొందాడు. ఆపై ‘ద రాక్‌’, ‘ఫేస్‌ ఆఫ్‌’, ‘కాన్‌ ఎయిర్‌’, ‘సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌’, ‘అడాప్టేషన్‌’, ‘నేషనల్‌ ట్రెజర్‌’, ‘కిక్‌ యాస్‌’, ‘ఘోస్ట్‌ రైడర్‌’లాంటి సినిమాలతో అతడి పేరు మార్మోగిపోయింది. ఏ పాత్రనైనా ఓ ప్రత్యేకమైన స్టైల్‌తో, విలక్షణమైన శరీరభాషతో, అరుదైన అభినయంతో పండిస్తాడనే పేరు సంపాదించాడు నికొలాస్‌ కేజ్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.