ఫాంటసీ చిత్రాల నటుడు

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ సినిమాలు ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’, ‘ద హాబిట్‌’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌’, ‘ట్రాయ్‌’లాంటి చిత్రాల్లో ఆకట్టుకున్న నటుడు ఆర్లాండో బ్లూమ్‌. ఇంగ్లండ్‌లో 1977లో పుట్టిన ఇతడు తల్లి ప్రోత్సాహంతో నటుడిగా మారి అటు రంగ స్థలం మీద, ఇటు వెండితెర మీద రాణించాడు. ‘రిడ్లీ స్కాట్స్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ హెవెన్‌’, ‘ఎలిజబెత్‌ టౌన్‌’ లాంటి చిత్రాల్లో పేరుతెచ్చుకున్న ఇతడు యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి ప్రతిష్ఠాత్మకమైన బాఫ్తా బ్రిటానియా హ్యుమానిటేరియన్‌ అవార్డు అందుకున్నాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.