
‘
అమెరికన్ బ్యూటీ’, ‘స్కైఫాల్’లాంటి చిత్రాలు తెరకెక్కంచిన దర్శకుడు శామ్ మెండస్. ప్రస్తుతం ‘1917’ అనే మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలైంది. కథేంటంటే అది మొదటి ప్రపంచ యుద్ధ సమయం. ఇద్దరు యువకులు తమ సైన్యానికి ఒక కచ్చితమైన సమాచారాన్ని చేరవేయాల్సి ఉంది. సరైన సమయంలో ఈ యువసైనికులు చెప్పే సందేశంపై సుమారు పదహారు వందలమంది సైనికుల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. అది కూడా వీళ్లు శత్రుదేశానికి చెందిన భూభాగం దాటి ఇరవైనాలుగు గంటల్లో వెళ్లాల్సి ఉంటుంది. చిత్రంలో స్కోఫీల్డ్గా జార్జి మెకాయ్, బ్లేక్గా డీన్ ఛార్లెస్ నటిస్తున్నారు. వీరితో పాటు కోలిన్ ఫిర్త్, ఆండ్రూ స్కాట్, రిచర్డ్ మాడెన్ తదితరులు నటిస్తున్నారు. డ్రీమ్ వర్క్స్ పిక్చర్స్, రియలన్స్ ఎంటర్టైన్మెంట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీదారుగా వ్యవహిరిస్తుంది. థామస్ న్యూమెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25, 2019న తెరపైకి రానుంది.