మంత్రగత్తెగా వస్తున్న ఏంజెలీనా

హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి నటిస్తున్న చిత్రం ‘మాలిఫ్సియెంట్‌: మిస్టీరిస్‌ ఆఫ్‌ ఈవిల్‌’. వాల్ట్‌డిస్నీ పిక్చర్స్, మోషన్‌ ఫిల్మ్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోచిమ్‌ రోనింగ్‌ దర్శకుడు. ఏంజెలినా ఇందులో మంత్రగత్తెగా కనిపించనుంది. ఇది గతంలో వచ్చిన ‘మాలిఫ్సియెంట్‌’ చిత్రానికి సీక్వెల్‌. అప్పట్లో రాబర్ట్‌ స్ట్రామ్‌బెర్గ్‌ దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని మే 29, 2020 సంవత్సరంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతకంటే ముందుగానే అంటే అక్టోబర్‌ 18, 2019లోనే విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది. నల్ల కొమ్ములతో కూడిన మంత్రగత్తెగా ఏంజెలీనాను అనుకున్న సమయానికి కంటే ముందే చూస్తామన్నమాట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.