మళ్లీ కలుస్తున్నారా?
హాలీవుడ్‌ తారలు ఏంజలీనా జోలీ, బ్రాడ్‌ పిట్‌ 2016లో తమ దాంపత్య జీవితానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వీరి నిర్ణయం అప్పట్లో అభిమానులను షాక్‌కు గురి చేసింది. వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పుడూ కలవని వీరు.. ఇటీవలే మళ్లీ జంటగా కనిపించడం అంతర్జాతీయ మీడియాలో ఎంతో హైలెట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తున్నట్లు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే ఏంజెలీనా - బ్రాడ్‌ ఇలా కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు. వారిద్దరూ తమ ఆరుగురు పిల్లల సంరక్షణ బాధ్యతల గురించి చర్చించుకోవడానికి గతంలో ఓ సారి భేటి అయ్యారు. పిల్లల పెంపకం విషయంలో ఏంజెలీనా - బ్రాడ్‌ పిట్‌ల ఓ మధ్య మళ్లీ ఓ అవగాహనకు వచ్చారు. దీనిలో భాగంగా పిల్లలు ఉభయుల సంరక్షణలో ఉండాలని నిర్ణయించుకొన్నారట. ఇదే సమయంలో ఏంజెలీనాతో సామరస్యంగా ఉంటూనే తండ్రిగా తన పిల్లలకు ఆనందాన్ని పంచాలని బ్రాడ్‌ పిట్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అప్పట్లో బ్రాడ్‌కు ఎమ్‌.ఐ.టి ప్రొఫెసర్‌ నేరీ ఆక్స్‌మన్, నటి చార్లెస్‌ థెరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని వారిద్దరూ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టిన్లయింది. ప్రస్తుతం ఏంజెలీనా, బ్రాడ్‌ పిట్‌ వారి వారి సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.