బాండ్‌ 25 వస్తున్నాడు

బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌.. ఈ పేరు ఓ సంచలనం. బాండ్‌ సిరీస్‌ చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తుంటారు. ఈ యాక్షన్‌ సన్నివేశాలకు ఎవరైనా ఆశ్చపోవాల్సిందే. ఇప్పటి వరకు 24 బాండ్‌ చిత్రాలొచ్చాయి. తాజాగా బాండ్‌ సిరీస్‌ 25వ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ‘నో టైమ్‌ టు డై’ అనే పేరు ఖరారు చేసింది చిత్ర బృందం. ఇందులో డేనియల్‌ క్రెయిగ్‌ నటిస్తున్నారు. బాండ్‌ పాత్రలో కనిపించడం డేనియల్‌కు ఇది ఐదోసారి. 2020 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకత్వం: కేరీ ఫకునగ.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.