ఆరవది వస్తోంది..అతనే లేడు.!

హాలీవుడ్‌ చిత్రం ‘పై రేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌’. ఈ చిత్రం ఇప్పటికి ఐదు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజగా ఈచిత్రం ఆరోభాగాన్ని త్వరలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు జానీడెవ్‌ ‘జాక్‌ స్పారో’ పాత్రలో నటించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. విశేషం ఏమిటంటే తాజాగా రాబోతున్న ఆరోభాగంలో జానీ డెవ్‌ కనిపించడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఎందుకు ఆయన్ని ఆరోభాగం నుంచి తొలగించారనే కారణం వెల్లడించలేదు. ‘జాక్‌ స్పారో’ పాత్రలో నటించబోయే కొత్త నటుడు ఎవరో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.© Sitara 2018.
Powered by WinRace Technologies.