సితార గళం... కలకలం!

హేష్‌ బాబు తనయ సితార ఎంత చలాకీగా ఉంటుందో తెలిసిన విషయమే. పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ సోషల్‌ మీడియాలో సందడంతా తనదే అనిపిస్తుంటుంది. ఇటీవలే ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరిస్తోంది. ఇప్పుడు వెండి తెరకు పరిచయం కాబోతుంది. అయితే సితార వెండితెరపై కనిపించదు. వినిపిస్తుంది. అదేంటి? అనుకుంటున్నారా... అవును సితార కేవలం ఓ పాత్రకు గాత్రం మాత్రమే అందిస్తుంది. తన గొంతు ద్వారానే ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. ఈ చిత్రంలో ఎల్సా అనే పాత్ర కీలకమైంది. తెలుగులో ఎల్సాకు కథానాయిక నిత్యామీనన్‌ డబ్బింగ్‌ చెప్తుందనే విషయం తెలిసిందే. చిన్ననాటి ఎల్సా (బేబీ ఎల్సా) పాత్రకు సితార తన వాయిస్‌ ఇస్తుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంచి అవకాశం లభించింది సితారా’, ‘శుభాకాంక్షలు సితారా’, ‘నీ వాయిస్‌ వినేందుకు వేచి చూస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.