నవ్వించిన నవలా చిత్రం

ప్రాచుర్యం పొందిన నవలల ఆధారంగా సినిమాలు తీయడం ప్రతి చిత్రసీమలోను కనిపించేదే. హాలీవుడ్‌లో కూడా అలాంటి సినిమాలు కోకొల్లలుగా ఉంటాయి. వాటిలో ఒకటి ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫానీస్‌’ (1961) సినిమా. అమెరికా రచయిత ట్రూమన్‌ కేపొటే 1958లో రాసిన నవల ఆధారంగా రొమాంటిక్‌ కామెడీ సినిమాగా దీన్ని తీశారు. అందాల తారలు ఆడ్రే హెప్‌బర్న్, పాట్రిసియా నీల్, నటుడు జార్జి పెపర్డ్‌ నటించిన ఈ సినిమాకు బ్లేక్‌ ఎడ్వర్డ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకోవడంతో పాటు 2.5 మిలియన్‌ డాలర్ల వ్యయానికి 14 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. సంపన్న వర్గానికి చెందిన యువతులతో ఓ మామూలు రచయితకు ఏర్పడిన అనుబంధాల నేపథ్యంలో కథ నవ్వులు పూయిస్తూ నడుస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.