చాప్లిన్‌ తీసిన తొలి పూర్తిస్థాయి చిత్రం!

ప్ర
పంచ ప్రఖ్యాతి పొందిన హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ ఎన్నో చిన్న చిన్న సినిమాలు తీసి నవ్వులు రువ్వించాడు. అతడు తొలిసారిగా తీసిన పూర్తి నిడివి చిత్రం ‘ద కిడ్‌’ (1921). దీనికి చాప్లిన్‌ నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయిత కూడా. నిశ్శబ్ద చలన చిత్ర చరిత్రలోనే మేటి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఇది, అప్పట్లోనే అత్యధిక వసూళ్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను అనాధ ఆశ్రమం దగ్గర వదిలేసిన ఓ తల్లి ఆత్మహత్య చేసుకోడానికి వెళ్లిపోతే, కొందరు ఆ బిడ్డను చెత్తకుప్పలో పారేస్తారు. ఆ బిడ్డను తెచ్చుకుని పెంచడానికి చార్లీచాప్లిన్‌ ఏం చేశాడనేది కథ. పిల్లాడితో అతడి బంధం, ఇద్దరూ కలిసి చేసే అల్లరి, కొనేళ్ల తర్వాత అసలు తల్లి రావడం, అనాథ ఆశ్రమం వారి ఫిర్యాదుపై పోలీసుల రంగప్రవేశం, పిల్లాడిని వాళ్లు తీసుకెళ్లినప్పుడల్లా చాప్లిన్‌ వాడిని తిరిగి ఎత్తుకొచ్చేయడం... ఇలాంటి సన్నివేశాల మధ్య నవ్విస్తూనే, కంటతడి పెట్టిస్తుందీ సినిమా. రెండున్నర లక్షల డాలర్ల ఖర్చుతో తీసిన ఈ 68 నిమిషాల సినిమా, 54 లక్షల డాలర్లను వసూలు చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.