
అసలే వాల్ట్డిస్నీ సినిమా... ఆపై యానిమేషన్ హంగామా... దీనికి తోడు చక్కని సంగీతం... ఇవి చాలదన్నట్టు వాల్ట్డిస్నీ జంతువుల పాత్రలన్నీ సంగీతానికి అనుగుణంగా చేసే విన్యాసాలు... ఇంకా చెప్పాలంటే ఇది తొలి స్టీరియోఫోనిక్ శబ్దంతో వచ్చిన చిత్రం...ఇన్ని విశేషాలు తోడవడం వల్ల ‘ఫాంటాసియా’ సినిమా వెండితెరపై అపురూపమైన దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించింది. వాల్ట్డిస్నీ సంస్థ నుంచి వచ్చిన మూడో యానిమేటెడ్ సినిమాగా వచ్చిన ఇది, ఎనిమిది విభాగాల సమ్మేళనంగా ఉంటుంది. ఈ సినిమాను రూపొందించడానికి 1000 మంది చిత్రకారులు, సాంకేతిక నిపుణులు కలిసి శ్రమించి 500 పైగా యానిమేషన్ పాత్రలకు తెరపై జీవం పోశారు. ఇందులో ఒక విభాగంలో మిక్కీమౌస్ మ్యాజిక్ చేస్తే, మరో విభాగంలో ఏక కణ జీవి నుంచి డైనోసార్లు పుట్టి అంతరించడం వరకు పరిణామ క్రమాన్ని కళ్లకు కడుతుంది. ఓసారి ఆస్టిచ్ర్లు, నీటి ఏనుగులు, ఏనుగులు, మొసళ్లు నృత్యం చేస్తే, మరోసారి మంచి, చెడు శక్తుల మధ్య పోరాటం ఆకట్టుకుంటుంది. ఇలా రెండు గంటల పాటు సాగే ఈ సినిమా 2.28 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 76 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించి అలరించింది. దీనికి సీక్వెల్గా వాల్ట్డిస్నీ మేనల్లుడు రాయ్ ఇ.డిస్నీ ‘ఫాంటాసియా 2000’ పేరుతో 1999లో మరో సినిమాను రూపొందించడం విశేషం. ఈ సినిమా డీవీడీలు, బ్లూరేల ద్వారా కూడా విè [ుదలై ఇప్పటికీ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.