చిన్న కథ... పెద్ద సినిమా

ఇప్పుడంటే రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు సాగుతున్నాయ. కానీ ఇవేమీ లేని రోజుల్లో గుర్రపు బగ్గీలే సాధనాలు. నాలుగేసి గుర్రాలు లాగే ఇలాంటి బగ్గీలను ‘స్టేజ్‌కోచ్‌’అని పిలిచేవారు. పాత్యాశ్చ దేశాల్లో ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకమైన స్టేషన్లు కూడా ఉండేవి. ఆయా స్టేషన్లలో అలసిపోయిన గుర్రాలను మార్చి కొత్త గుర్రాలను పూన్చి దూరపు ప్రయాణాలు సాగించేవారు. అలాంటి ప్రయాణంలో జరిగిన ఉత్కంఠ భరిత సంఘటనల నేపథ్యంలో వచ్చిన ‘స్టేజ్‌కోచ్‌’ సినిమా 1939లో విడుదలై ఆకట్టుకుంది. అందాల తార క్లైర్‌ ట్రెవర్, ప్రముఖ నటుడు జాన్‌ వానే నటించిన ఈ చిత్రం, అప్పట్లో రెట్టింపు లాభాలను రాబట్టుకుంది. రెండు ఆస్కార్‌ అవార్డులు సహా పలు పురస్కారాలు గెలుచుకుంది. మేటి పది క్లాసిక్‌ అమెరికా సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎర్నెస్ట్‌ హేకాక్స్‌ అనే రచయిత రాసిన ‘ద స్టేజ్‌ టు లార్డ్‌బర్గ్‌’ అనే చిన్న కథ ఆధారంగా దీనిని తీశారు. ఈ సినిమాను అమెరికా జాతీయ లైబ్రరీలో భద్రపరిచారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.