అయోమయంగాడి అద్భుత విజయం!
‘మిస్టర్‌ బీన్‌’కి పరిచయం అక్కర్లేదు. ఆ పేరు వినగానే ఓ అయోమయంగాడు గుర్తొస్తాడు. అలాంటి అయోమయం నటనతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు రోవన్‌ అట్కిన్‌సన్‌. టీవీ సీరియల్స్‌ ద్వారా ‘మిస్టర్‌ బీన్‌’గా దేశదేశాల్లో పిల్లలకు చేరువైన ఇతగాడు తనదైన అయోమయం పాత్రలో నటించిన చిత్రమే ‘బీన్‌: ద అల్టిమేట్‌ డిజాస్టర్‌ మూవీ’. 1997 నవంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా 18 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 251 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. జాతీయ మ్యూజియం సెక్యూరిటీ గార్డుగా పనిచేసే బీన్, ఎన్ని అవకతవక పనులు చేశాడు, తన పిచ్చి పనుల వల్ల కలిగిన నష్టాన్ని చివరికి తనే సరిదిద్ది ఉద్యోగం పోకుండా ఎలా చూసుకున్నాడనేదే కథ.© Sitara 2018.
Powered by WinRace Technologies.