వేగానికి మారుపేరు!
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమాలను తల్చుకోగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ‘పాల్‌ వాకర్‌’. ఆ చిత్రాలతో దేశదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు వీధుల్లో రేసింగ్‌ చేసే బ్రియాన్‌ ఓకానర్‌ పాత్రలో వేగానికి మారుపేరుగా గుర్తింపు పొందాడు. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పేరుతో 2001 నుంచి వరసగా వచ్చిన ఆరు సినిమాల్లో నటించాడు. అయితే 2013లో ‘ఫ్యూరియస్‌ 7’ సినిమాలో నటిస్తూ అనూహ్యమైన ప్రమాదానికి గురై మరణించి అభిమానులకు విషాదాన్ని మిగిల్చాడు. 1973 సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియాలో పుట్టిన పాల్‌ వాకర్, టీవీల ద్వారా సినిమాల్లోకి వచ్చి మొదట్లో ‘షీ ఈజ్‌ ఆల్‌దట్‌’, ‘వార్సిటీ బ్లూస్‌’, ‘జోయ్‌ రైడ్‌’, ‘టైమ్‌లైన్‌’, ‘రన్నింగ్‌ స్కేర్‌డ్‌’ లాంటి సినిమాలు చేశాడు. 
                                                                 
© Sitara 2018.
Powered by WinRace Technologies.