రెండు మనసులు ఒక్కటైన వేళ!

ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌.. వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టేశారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌లో ఈ జంట పెళ్లి క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో ఘనంగా జరిగింది. మెహందీ, సంగీత్‌ వేడుకల్లో ఈ జంట ఖుషీగా గడిపింది. ఆ ఫోటోల్లో ప్రియాంక ఎంత హుషారుగా కనపించిందో తెలిసిందే. కానీ ప్రియా, నిక్‌లు పెళ్లి దుస్తుల్లో ఎలా ఉంటారో చూడాలనే ఆత్రుత మాత్రం అభిమానుల్లో అలానే ఉండిపోయింది. దానికి తెరదించుతూ ప్రియాంక, నిక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. క్రిస్టియన్‌ పద్ధతిలో జరిగిన వివాహం కోసం ప్రముఖ డిజైనర్‌ రాల్ఫ్ లారెన్స్‌ రూపొందించిన దుస్తులో మెరిసిపోయారు. ఆ తర్వాత హిందూ పద్ధతిలో జరిగిన పెళ్లి కోసం ప్రియాంక ఎర్ర రంగు లెహంగా, నిక్‌ బంగారు వర్ణపు షేర్వాణీ ధరించి నూతన జీవితానికి స్వాగతం పలికారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.