సినీ చరిత్రలో మేటి సినిమా!
* సినీ చరిత్రలో మేటి సినిమా!


- ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా పేరొందింది..

- ఎన్నో భాషల్లో వచ్చిన ఎన్నో మాఫియా కథలకు నాందిగా నిలిచింది...

- మూడు ఆస్కార్‌లతో పాటు మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు గెల్చుకుంది...

- మరో రెండు సీక్వెల్‌ సినిమాలకు మూలమైంది...

- 6.5 మిలియన్‌ డాలర్లతో నిర్మితమై, ఏకంగా 286 మిలియన్‌ డాలర్లు కురిపించింది...

- జాతీయ సినీ గ్రంథాలయంలో చోటు సంపాదించింది...
 
-ఆ సినిమానే ‘ది గాడ్‌ఫాదర్‌’ (1972).

అమెరికా, ఇటలీలలో వేళ్లూనుకుపోయిన నేర సామ్రాజ్యాలు, నేరగాళ్ల ముఠాలనే నేపథ్యంలో తీసుకుని అమెరికాకు చెందిన రచయిత, జర్నలిస్ట్‌ మారియో పుజో 1969లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ సంస్థ తీసిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు మార్లన్‌ బ్రాండో నటించాడు. మాఫియా నాయకుడి కథగా ఇది, చీకటి సామ్రాజ్యంలో ఎత్తులు, పైఎత్తులు, ఆధిపత్యం కోసం పోరాటాలు వంటి అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీనికి కొనసాగింపుగా ‘ద గాడ్‌ఫాదర్‌ 2’ (1974), ‘ది గాడ్‌ఫాదర్‌ 3’ (1990) సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.