భవిష్యత్‌లో భయంకరమైన ఆట

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా... పైగా భవిష్యత్తు కాలానికి సంబంధించింది... దానికి సాయం భయంకరమైన ఆట నేపథ్యంలో ఉత్కంఠభరితమైన కథనం... ఇన్ని చాలవూ సినిమా కాసులు కురిపించడానికి? అందుకే, ‘ద హంగర్‌ గేమ్స్‌’ సినిమా అంత పనీ చేసింది. అంతర్జాతీయంగా యువతకు ఆకట్టుకుంది. సుజానే కోలిన్స్‌ అనే రచయిత్రి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కథ భవిష్యత్‌ కాలానికి చెందిన ఓ ఊహాజనిత ప్రాంతంలో జరుగుతుంది. ఆ దేశాన్ని పన్నెండు విభాగాలుగా విభజించి ప్రతి ఏటా ఒకో విభాగం నుంచి ఓ అమ్మాయిని, అబ్బాయిని ఎంపిక చేస్తారు. వారితో ఓ భయంకరమైన ఆట ఆడిస్తారు. ఆ ఆటలో విజయం సాధించాలంటే రెండో వాళ్లు మరణించాల్సిందే. ఆ ఆటను దేశ ప్రజలంతా టీవీల ద్వారా చూస్తుంటారు. ఈ సినిమా 2012లో విడుదలై, 78 మిలియన్‌ డాలర్ల పెట్టుబడకి ఏకంగా 694.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అనేక అవార్డులు పొందింది. ఈ సినిమాను ఆ తర్వాత డీవీడీలు, బ్లూరేల ద్వారా విడుదల చేసినా రికార్డు అమ్మకాలు జరగడం విశేషం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.