యూరప్‌ను కాపాడిన బాండ్‌!
                              

ఓ చమురు వ్యాపారి హత్యకు గురయ్యాడు. అతడి కూతురు ప్రమాదంలో ఉంది. అంతేనా? యూరప్‌ దేశాలకు చమురు సరఫరా చేసే పైప్‌లైన్‌ను పేల్చేయాలని దుండగులు ప్రయత్నిస్తున్నారు. అదిగానీ పేలితే యూరప్‌ మొత్తం నాశనం అయిపోతుంది. అయ్యబాబోయ్‌... ఎలా? కంగారేమీ అక్కర్లేదు... జేమ్స్‌బాండ్‌ ఉన్నాడుగా?! తమ స్వార్థానికి ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ అంటూ రెచ్చిపోతున్న దురాశాపరుల ఆటకట్టించడానికి బాండ్‌ హుటాహుటిన బయల్దేరాడు. వెండితెరపై ఒళ్లు గగుర్పొడిచిన పోరాటాలు, ఛేజింగ్‌లు, ఎత్తులు పైఎత్తుల మధ్య అందరి ఆట కట్టించేశాడు. బాండ్‌ పాత్రలో పియర్స్‌ బ్రాస్నన్‌ మూడోసారి నటించిన ఈ సినిమా 1999 నవంబర్‌ 8న విడుదలై 362 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.© Sitara 2018.
Powered by WinRace Technologies.