బ్రిటిష్‌ చిత్రాల్లో మేటి!

బ్రిటిష్‌ చిత్రాలన్నింటిలో గొప్పదిగా ఓ సినిమా పేరు తెచ్చుకుంది. అదే ‘ద థర్డ్‌ మ్యాన్‌’. క్రైమ్‌ డ్రామాగా తీసిన ఈ సినిమాను తీసిన విధానంపై పుస్తకాలు కూడా వచ్చాయి. చిత్రీకరణలో వాడిన లైటింగ్, స్కీన్ర్‌ప్లే తీరుతెన్నులు, నటీనటుల అభినయం, ‘డచ్‌యాంగిల్‌’ అనే కెమేరా టెక్నిక్, నేపథ్య సంగీతం అన్నీ విమర్శకుల ప్రశంసలు పొందాయి. లండన్‌ ఫిల్మ్‌ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి కరోల్‌ రీడ్‌ దర్శకత్వం వహించగా, జోసెఫ్‌ కాటెన్‌ హీరోగా, అలీదా వల్లీ కథానాయికగా నటించారు. ఆర్సన్‌ వెల్స్, ట్రీవోర్‌ హోవర్డ్‌ తదితర నటులు నటించారు. సెప్టెంబర్‌ 1, 1949న యనైటెడ్‌ కింగ్డమ్‌లో చిత్రం విడుదలైంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.