అనుపమ ముద్దు పేరుకి అర్థం ఉందట!

సాధారణంగా కొందరి వ్యక్తుల పేర్లకు వివిధ రకాల అర్థం ఉంటుంది. మరి ముద్దు పేరుకు? ముద్దు పేరంటే చిన్ని, బన్ని, నాని, పండు.. ఇలా ఉంటాయ్, వాటికి అర్థం ఏంటి? అనుకుంటున్నారా. యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌కు ఉందండోయ్‌! ఇంతకీ అసలు అనుపమ నిక్‌ నేమ్‌ తెలుసా.. ‘పొన్ను’. ఓ సందర్భంలో ఆ పేరుకున్న అర్థం చెప్పుకొచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. పొన్ను అంటే మలయాళంలో బంగారమట. ఇదీ అనుపమ ముద్దు పేరు రహస్యం. మీ ముద్దు పేరుకు ఇతర భాషల్లో ఏమైనా అర్థం ఉందేమో వెతికేయండి మరి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.